BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 27 May 2026, 07:59 pm
Posted by : V శ్రీనివాస్

రైలులో చోరీ.. నిందితుల అరెస్టు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
27 May, 2026 - 07:59 PM
155 వీక్షణలు

మంచిర్యాల రైలులో ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను రైల్వే రక్షక దళ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 25న రైలులో ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికుల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో బుధవారం మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఎండి. రేహాన్, రాఘవేంద్ర, వెంకటేశ్వర్లుతో పాటు కొందరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, తామే రైలులో దొంగతనం చేసినట్లు నేరాన్ని అంగీకరించారు. వారి వద్ద నుండి బంగారు చెవి కమ్మలు, 6 ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిందితులపై కేసు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు తెలిపారు. రైల్వే స్టేషన్లు, రైళ్లలో ప్రయాణికులు తమ వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఈ సందర్భంగా సూచించారు