BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 08 April 2026, 02:46 pm
Posted by : V శ్రీనివాస్

​మంచిర్యాలలో ముగిసిన 24 గంటల బీసీల నిరవధిక దీక్ష

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
08 Apr, 2026 - 02:46 PM
237 వీక్షణలు

​మంచిర్యాలలో ముగిసిన 24 గంటల బీసీల నిరవధిక దీక్ష: ప్రభుత్వాలకు హెచ్చరిక

మంచిర్యాల పట్టణంలోని గాంధీ పార్కులో బీసీల డిమాండ్ల సాధనకై గుమ్మల శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టిన 24 గంటల నిరవధిక దీక్షను డాక్టర్ రఘునందన్ మరియు ఇతర నాయకులు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రఘునందన్ మాట్లాడుతూ, దేశ జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో జనాభా నిష్పత్తి ప్రకారం వాటా దక్కకపోవడం బాధాకరమని, 10 శాతం లేని అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించి బీసీల న్యాయమైన డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించడం అన్యాయమని పేర్కొన్నారు. రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలంతా సంఘటితమై ఉద్యమించాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో నిరసనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది కర్రే లచ్చన్న, తెలంగాణ గంగపుత్రుల సంఘం జిల్లా అధ్యక్షులు వెన్నెల నరసయ్య, బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సదానందం, బీసీ నాయకులు వేముల అశోక్, కొట్టే నటేశ్వర్, శెట్టిపల్లి గట్టయ్య, రామగిరి రాజన్న చారి, గగ్గూరి రాజన్న, మాచర్ల పోచం, తిరుపతి, మరియు అకిరా జాను తదితరులు పాల్గొని తమ మద్దతును ప్రకటించారు