BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 07 June 2026, 02:51 pm
Posted by : V శ్రీనివాస్

మందమర్రి టోల్ ప్లాజా వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా.. తప్పిన పెద్ద ప్రమాదం

తెలంగాణ
/ మంచిర్యాల / మందమర్రి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
07 Jun, 2026 - 02:51 PM
228 వీక్షణలు

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సింగరేణి కేకే మైన్ ఓపెన్ కాస్ట్ టోల్ ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజామున ఒక భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొత్తగూడెం నుండి బెల్లంపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఉదయం 4 గంటల ప్రాంతంలో టోల్ ప్లాజా వద్దకు రాగానే ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో కేవలం ఒక్కడే ప్రయాణికుడు ఉండటంతో అతడు ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డాడు. బస్సులో ఎక్కువ మంది ప్రయాణికులు లేకపోవడంతో ఒక పెను ప్రమాదం తప్పినట్లయింది, దీంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

​ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కావడంతో, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు టోల్ ప్లాజా సిబ్బంది వెంటనే స్పందించి, రోడ్డుపై బోల్తా పడిన బస్సును పక్కకు తొలగించేందుకు చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదం బస్సు అతివేగం వల్ల జరిగిందా లేక తెల్లవారుజామున డ్రైవర్ నిద్రలోకి జారుకోవడం వల్ల జరిగిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై సంబంధిత అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది