BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 15 May 2026, 04:11 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

దేశంలో మోసకారితనమే మిగిలింది..!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 04:11 PM
145 వీక్షణలు

రైతే దేశానికి వెన్నెముక అని వేదికలపై గొప్పలు చెప్పే కేంద్ర ప్రభుత్వం, ఆచరణలో మాత్రం అన్నదాతను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తోందన్న విమర్శలు మరింత బలపడుతున్నాయి. 2026-27 సీజన్‌కు కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరలు రైతాంగాన్ని ఊరటపరచలేకపోయాయి. ఎరువులు, పురుగుల మందులు, డీజిల్‌, యంత్రాల నిర్వహణ ఖర్చులు 20-30 శాతం వరకూ పెరిగిపోయిన పరిస్థితుల్లో, మద్దతు ధరల్లో మాత్రం స్వల్ప పెంపులతో సరిపెట్టడం రైతుల ఆగ్రహానికి కారణమవుతోంది.

ధాన్యానికి క్వింటాకు కేవలం రూ.72 పెంపు, మొక్కజొన్నకు రూ.10, పెసలుకు రూ.12 మాత్రమే పెంచడం ద్వారా ప్రభుత్వం రైతుల వాస్తవ కష్టాలను పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యవసాయ రంగం ఇప్పటికే వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం, యుద్ధ పరిస్థితులు, ఎగుమతుల మందగమనం వంటి సమస్యలతో సతమతమవుతుండగా.. రైతుకు బలంగా నిలవాల్సిన ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

స్వామినాథన్ కమిషన్ సూచించిన “సి2 + 50 శాతం” ఫార్ములాను అమలు చేస్తేనే రైతుకు కనీస న్యాయం జరుగుతుందని రైతు సంఘాలు ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా, కేంద్రం దానిపై స్పష్టమైన చర్యలు తీసుకోలేదు. పైగా ఎరువుల సబ్సిడీల కోతలు, మార్కెట్ శక్తుల ఆధీనంలో రైతును వదిలేయడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది.

అభివృద్ధి చెందిన దేశాలు వ్యవసాయ రంగానికి భారీ రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తుంటే.. భారత రైతాంగంపై మాత్రం భారాలు మోపడం దారుణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైతు బతికితేనే దేశ ఆర్థిక వ్యవస్థ నిలబడుతుందనే వాస్తవాన్ని గుర్తించి, వ్యవసాయ రంగానికి నిజమైన భరోసా కల్పించే విధానాలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే రైతు పేరుతో చేసే ప్రతి హామీ.. మోసకారితనంగానే మిగిలిపోతుంది.