BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 03 January 2026, 08:36 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

తెలంగాణ
03 Jan, 2026 - 08:36 AM
264 వీక్షణలు

2027 గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలి

ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్ NTODAY NEWS: జగిత్యాల జిల్లా  జూలై 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధులు, వికలాంగులు మరియు ట్రాన్స్‌జెండర్ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్‌తో కలిసి పుష్కరాల ప్రణాళికపై ప్రాథమికంగా సమీక్ష నిర్వహించారు. మున్సిపల్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి తదితర ఇంజనీరింగ్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి, పుష్కరాలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నందున ధర్మపురి పట్టణాన్ని ఆధ్యాత్మిక పట్టణంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ సందర్భంగా పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన అవసరమైన ఏర్పాట్ల కోసం ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ధర్మపురిలో గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. పుష్కరాల సందర్భంగా వచ్చే భక్తుల రద్దీని అంచనా వేసి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. పుష్కర స్నానాల కోసం వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. 2027 జూలై 23 నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలకు శాశ్వత మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. పుష్కర ఘాట్లకు వచ్చే భక్తులకు అవాంతరాలు లేకుండా లింక్ రోడ్లు, ఇతర సౌకర్యాలు శాశ్వతంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాలో ప్రవహించే గోదావరి నది తీరం వెంట ఉన్న గ్రామాల్లో కూడా పుష్కర ఘాట్ల ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పుష్కర స్నానాలకు అనువైన గోదావరి తీర ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని తెలిపారు. 2015లో సుమారు 1.50 కోట్ల మంది భక్తులు పుష్కరాలకు హాజరైనట్లు గుర్తు చేస్తూ, ఈసారి దాదాపు 4.50 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా రోడ్లు, రహదారుల నిర్మాణం, ట్రాఫిక్ నిర్వహణ, వాహనాల పార్కింగ్, తాగునీరు, స్నాన ఘాట్లు, వసతి సదుపాయాలు తదితర అన్ని ఏర్పాట్లు సమగ్రంగా ఉండేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. Follow us on Website Facebook Instagram YouTube