BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 13 May 2026, 09:22 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

CM వాహన శ్రేణికి కత్తెర.. 50 శాతం తగ్గింపునకు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 May, 2026 - 09:22 PM
140 వీక్షణలు

పొదుపు చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వాహన శ్రేణిలోని వాహనాల సంఖ్యను 50 శాతం మేర తగ్గించాలని అధికారులను ఆదేశించారు. పెట్రోలు, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇకపై జిల్లా పర్యటనల సమయంలో అవసరమైన వాహనాలనే వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర పోలీసు ప్రధానాధికారి, నిఘా విభాగ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.

మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా వాహన శ్రేణుల్లో వాహనాల వినియోగాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వ ఖర్చులు తగ్గించడం, ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించి మరిన్ని కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.