BREAKING
thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు
Date of Publish : 25 June 2026, 07:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ముసునూరులో మట్టి తవ్వకాల వివాదం.. ఇరువర్గాల మధ్య ఘర్షణ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 07:17 PM
118 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ముసునూరు గ్రామంలో మట్టి తవ్వకాల అంశం ఉద్రిక్తతకు దారితీసింది. గురువారం మట్టి విక్రయాల ధరల విషయంలో తలెత్తిన వివాదంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని, అనంతరం ఘర్షణకు దారితీసింది.

స్థానికుల కథనం ప్రకారం, అవసరమైన వారికి ట్రక్కు మట్టిని రూ.120కే అందిస్తామని గ్రామంలో చాటింపు వేయగా, వాస్తవంగా రూ.200 వరకు వసూలు చేస్తున్నారని కొందరు ప్రశ్నించారు. దీంతో రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి బాహాబాహీకి దారితీసింది.

ఘటనతో గ్రామంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మట్టి తవ్వకాల నిర్వహణ, ధరల నిర్ణయంలో పారదర్శకత లేకపోవడమే ఈ వివాదానికి కారణమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

మరోవైపు, మట్టి తవ్వకాలకు అవసరమైన అధికారిక అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశంపై కూడా గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు వెంటనే విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.