BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 30 January 2026, 10:32 am
Posted by : NTODAY NEWS OFFICIAL

సమ్మక్క–సారలమ్మ జాతరకు మంత్రి అడ్లూరి హాజరు

తెలంగాణ
30 Jan, 2026 - 10:32 AM
245 వీక్షణలు
రాజారాంపల్లి సమ్మక్క–సారలమ్మ జాతరకు మంత్రి అడ్లూరి హాజరు అమ్మవార్లకు ఎత్తు బంగారం సమర్పణ – గ్రామాభివృద్ధికి రూ.10 లక్షల హామీ NTODAY NEWS: గొల్లపల్లి మండలం న్యూస్ రిపోర్టర్ జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న సమ్మక్క–సారలమ్మ జాతరలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులలో భాగంగా తన బరువుకు సమానమైన ‘ఎత్తు బంగారం’ (బెల్లం)ను అమ్మవార్లకు సమర్పించారు. జాతర ప్రాంగణానికి చేరుకున్న మంత్రికి జాతర కమిటీ సభ్యులు, గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. గ్రామాభివృద్ధికి నిధుల హామీ అనంతరం మంత్రి మాట్లాడుతూ, భక్తుల కొంగుబంగారమైన సమ్మక్క–సారలమ్మ దీవెనలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. రాజారాంపల్లి గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారంగా రూ.10 లక్షల నిధులు కేటాయిస్తానని జాతర కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. #SammakkaSaralamma #TempleFestival #Jathara2026 #TelanganaCulture #MinisterVisit #VillageDevelopment #ReligiousEvents Follow us on Website Facebook Instagram YouTube