BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 05 March 2026, 08:54 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మాజీ సర్పంచ్ ని పరామర్శించిన ఎంపీ

తెలంగాణ
05 Mar, 2026 - 08:54 AM
335 వీక్షణలు
మాజీ సర్పంచ్ మోమిన్ అక్తర్ బీని పరామర్శించిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ మోమిన్ అక్తర్ బీని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి పరామర్శించారు. హైదరాబాద్‌లోని సింధు హాస్పిటల్‌లో మోమిన్ అక్తర్ బీకి ఇటీవల మేజర్ శస్త్రచికిత్స జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు మోమిన్ షబానాతో కలిసి గురువారం ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. అనంతరం ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి మోమిన్ అక్తర్ బీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆత్మకూరు మేజర్ గ్రామ పంచాయతీకి మోమిన్ ఉసెన్ సా, మోమిన్ జిలాని దీర్ఘకాలం సర్పంచ్‌లుగా పనిచేశారు. మహిళా రిజర్వేషన్ అమల్లోకి వచ్చిన తర్వాత జిలాని భార్య మోమిన్ అక్తర్ బీని సర్పంచ్‌గా పోటీ చేయించి గెలిపించారు. ఆత్మకూరు మేజర్ గ్రామ పంచాయతీ చరిత్రలో మోమిన్ కుటుంబం సుమారు 50 సంవత్సరాల పాటు గ్రామ సర్పంచ్‌లుగా పాలన చేయడం విశేషం. మేజర్ ఆపరేషన్ అనంతరం మోమిన్ అక్తర్ బీ త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆకాంక్షించారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడుతుందని మోమిన్ షబానాకు ధైర్యం చెప్పారు. #Nandyal #Srisailam #Atmakur #ByreddyShabari #MominaAkhtarBee #PoliticalNews #AndhraPradeshNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube