BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 16 March 2026, 04:30 pm
Posted by : గడ్డమీది రమేష్

అయ్యప్ప స్వామి ఆలయ ప్రాణ ప్రతిష్ఠ

భక్తి భక్తి
Reporter
గడ్డమీది రమేష్ కోహెడ మండల ప్రతినిధి
16 Mar, 2026 - 04:30 PM
488 వీక్షణలు

మూడు రోజుల పూజా కార్యక్రమాలు

కోహెడ మండలంలో అయ్యప్ప స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ రోజు ఘనంగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. కేరళ నుండి ప్రత్యేకంగా తయారు చేయించిన అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ఎంతో పవిత్రంగా మరియు శాస్త్రోక్తంగా ఆలయానికి తీసుకొచ్చారు.

ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి ట్రస్ట్ సభ్యులు, గ్రామ సర్పంచ్, అయ్యప్ప మాల ధరించిన స్వాములు, వివిధ గ్రామాల నాయకులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ముందుగా అయ్యప్ప స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తుల మధ్య ఘనమైన ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు.

తరువాత నూతనంగా నిర్మించబడిన గర్భగుడిలో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తూ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు అనేక ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు.

ప్రాణ ప్రతిష్ఠ అనంతరం మూడు రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు మరియు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ ఈ వేడుకలను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమాన్ని కోహెడ మండల అయ్యప్ప సేవ సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు, నాయకులు మరియు భక్తులు కలిసి విజయవంతంగా నిర్వహించారు.