BREAKING
thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు
Date of Publish : 27 May 2026, 07:21 pm
Posted by : కూనురు మధు

నార్కట్‌పల్లిలో బైకులు, మేకల దొంగల అరెస్ట్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
27 May, 2026 - 07:21 PM
446 వీక్షణలు

7 బైకులు, ఒక కారు స్వాధీనం

విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి బైకులు, మేకల దొంగతనాలకు పాల్పడుతున్న ఒక అంతర్రాష్ట్ర దొంగను, అతనికి సహకరిస్తున్న ఒక మైనర్ బాలుడిని  నార్కట్‌పల్లి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ. 20,000 నగదుతో పాటు 7 మోటార్ సైకిళ్ళు, దొంగతనాలకు ఉపయోగించిన ఒక బ్రీజా కారును స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి శివరాం రెడ్డి కేసు వివరాలను తెలుపుతూ ​నల్లగొండ జిల్లా ఎస్పీ  శరత్ చంద్ర పవార్  ఆదేశాల మేరకు జిల్లాలో పెరుగుతున్న బైకులు దొంగతనాలు, పశువుల దొంగతనం కేసులపై నార్కట్‌పల్లి పోలీసులు ప్రత్యేక  నిఘా పెట్టారని తెలిపారు. ఈ క్రమంలో బుధవారం (27-05-2026) ఉదయం 9:00 గంటల ప్రాంతంలో నార్కట్‌పల్లి గ్రామ శివారులోని నల్లగొండ రోడ్డు ఫ్లైఓవర్ సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ​ఆ సమయంలో నంబర్ ప్లేట్ లేని ఒక హీరో ప్యాషన్ ప్రో బైక్‌పై అనుమానాస్పదంగా వస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి విచారించగా, గత నెల 8వ తారీఖున న అమ్మనబోలు గ్రామానికి చెందిన జటంగి మహేష్ ఇంటి ముందు పార్క్ చేసి పోయిన బైక్ TS05EL5082 గా గుర్తించారు గుర్తించారని తెలిపారు. పట్టుపడ్డ నిందితులలో​గువ్వల శబరీష్ (29) , ​ఒక మైనర్ బాలుడు పట్టుబడ్డారు. గతంలో గువ్వల శబరీష్ నల్లగొండ జిల్లాలో 18 కేసులు, ఇతర రాష్ట్రాల్లో 3 కేసుల్లో నిందితుడిగా ఉండి జైలుకు వెళ్లి వచ్చాడు జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత సులభంగా డబ్బు సంపాదించి జల్సాలు చేయాలని ఇద్దరూ ప్లాన్ చేశారు. హైదరాబాద్‌లో ఒక బ్రెజ్జా కారును అద్దెకు తీసుకుని, పగటిపూట గ్రామ శివారుల్లో తిరుగుతూ రేకీ నిర్వహించేవారని
​రాత్రి వేళల్లో మేకలు, గొర్రెల దొడ్ల వద్దకు వెళ్లి వాటిని దొంగిలించి కారులో తరలించేవారని  అనంతరం వాటిని గుంటూరు జిల్లా నల్లపాడు సంతలో గుర్తుతెలియని వ్యక్తులకు విక్రయించి వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడిపేవారు. అలాగే, ఇళ్ల ముందు పార్క్ చేసిన బైకుల తాళాలు విరగ్గొట్టి దొంగిలించి, వాటికి ఫేక్ నంబర్ ప్లేట్లు తగిలించి అవసరమైన వారికి  విక్రయించే వారిని పేర్కొన్నారు. నిందితులను విచారించగా
​నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో  2 బైకులు, 1 మేక దొంగతనం. ​దేవరకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 బైక్ దొంగతనం. కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో  2 బైకుల దొంగతనం. ​నల్లగొండ రూరల్ స్టేషన్ పరిధిలో  1 మేక దొంగతనం.​అచ్చంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో  1 బైక్ దొంగతనం. ​నెల్లూరు పట్టణంలో 1 బైక్ దొంగతనం కేసుల్లో నిందితులుగా ఉన్నారని తెలిపారు ​నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన నార్కట్‌పల్లి సీఐ నాగరాజు, ఎస్ఐ విష్ణుమూర్తి, పోలీస్ కానిస్టేబుళ్లు సత్యనారాయణ, గిరిబాబు, సాయిలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.