BREAKING
ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ
Date of Publish : 27 July 2026, 09:56 pm
Posted by : కూనురు మధు

​నార్కట్‌పల్లిలో విద్యార్థుల మహాధర్నా

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
27 Jul, 2026 - 09:56 PM
42 వీక్షణలు

​నార్కట్‌పల్లిలో విద్యార్థుల మహాధర్నా   

ఫీజు రీయింబర్స్‌మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్

తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.10,000 కోట్లను తక్షణమే విడుదల చేయాలని మరియు జీవో నెంబర్ 9 ఆర్‌ఆర్ యాక్ట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నార్కట్‌పల్లిలో విద్యార్థులతో భారీ మహాధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ​ధర్నా సమయంలో విద్యార్థి నాయకులకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. కొందరు విద్యార్థులు బస్సులపైకి ఎక్కి నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం  నాయకులు మాట్లాడుతూ ​ఫీజు  బకాయిలు పడటంతో కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయని, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులకు పూర్తి ఫీజును ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యా రంగానికి తగినన్ని నిధులు కేటాయించాలని కోరారు. సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన రూ. 5 లక్షల ‘విద్యార్థి భరోసా కార్డు’ను వెంటనే అమలు చేయాలని అన్నారు ​ప్రభుత్వం స్పందించి వెంటనే విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే ఎంపీ ఆర్‌.కృష్ణయ్య ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్, బీజేపీ నాయకులు పల్లపు దుర్గయ్య, బిఆర్‌ఎస్ నాయకులు సురేష్, అఖిలపక్ష విద్యార్థి, బీసీ సంఘాల నాయకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.