BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 03 June 2026, 07:46 pm
Posted by : V శ్రీనివాస్

నాస్పూర్ కూరగాయల మార్కెట్ సమస్యల పరిష్కారానికి కృషి: మేయర్ ధరణి మధుకర్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
03 Jun, 2026 - 07:46 PM
159 వీక్షణలు

​మార్కెట్‌ను స్వయంగా పరిశీలించిన మేయర్

​సమస్యలు వివరిస్తూ వినతిపత్రం అందజేసిన వర్తక సంఘం

​ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ

​మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాస్పూర్ కూరగాయల మార్కెట్ ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలపై మేయర్ ధరణి మధుకర్ ప్రత్యేక దృష్టి సారించారు. సీసీసీ రాయల్ టాకీస్ సమీపంలోని ఈ మార్కెట్ వర్తక సంఘం సభ్యులు మేయర్‌ను కలిసి.. మార్కెట్‌లో మరుగుదొడ్లు, వీధి దీపాలు, బోర్ మోటార్ల కొరత వంటి సమస్యలపై వినతిపత్రం సమర్పించి, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. వర్తకుల విజ్ఞప్తిపై తక్షణమే స్పందించిన మేయర్, మార్కెట్ ప్రాంతాన్ని స్వయంగా సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు.

​ఈ సందర్భంగా మేయర్ ధరణి మధుకర్ మాట్లాడుతూ.. సమస్యల తీవ్రతను గుర్తించామని, వీటిని స్థానిక శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మార్కెట్ అభివృద్ధికి, వర్తకులకు మెరుగైన కనీస సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ పర్యటనలో మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు వర్తక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు