BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 09 June 2026, 08:18 pm
Posted by : V శ్రీనివాస్

​నేడు మంచిర్యాల జిల్లాలో మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి పర్యటన

తెలంగాణ
/ మంచిర్యాల / మందమర్రి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
09 Jun, 2026 - 08:18 PM
144 వీక్షణలు

NTODAY NEWS :- మందమర్రిలో జర్మనీ భాషా శిక్షణ కేంద్రం ప్రారంభం

​భీమారంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవం, చెక్కుల పంపిణీ

​చెన్నూరులో నూతన బస్తీ దవాఖాన ప్రారంభించనున్న మంత్రి

తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రివర్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి బుధవారం (జూన్ 10) మంచిర్యాల జిల్లాలోని పలు మండలాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. చెన్నూరు నియోజకవర్గ పరిధిలో సాగనున్న ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, సంక్షేమ కార్యక్రమాలలో ఆయన పాల్గొంటారని మంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

​మంత్రి గారి అధికారిక పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి:

​ఉదయం 10:30 గంటలకు (మందమర్రి):

రాష్ట్ర యువతకు విదేశాలలో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో, ఉపాధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఓవర్సీస్ మాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) ద్వారా ఏర్పాటు చేసిన "జర్మనీ భాషా శిక్షణ కేంద్రాన్ని" మందమర్రిలోని ఇల్లందు క్లబ్‌లో మంత్రి వివేక్ వెంకటస్వామి గారు ప్రారంభించనున్నారు.

​మధ్యాహ్నం 1:00 గంటకు (జైపూర్ మండలం):

జైపూర్ మండలంలోని టేకుమట్ల గ్రామానికి చేరుకుని, అక్కడ ఉన్న ప్రసిద్ధ బద్ధి పోచమ్మ ఆలయాన్ని దర్శించుకుని మంత్రి గారు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

​మధ్యాహ్నం 2:00 గంటలకు (భీమారం):

భీమారం మండల కేంద్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మంత్రి గారు ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయనున్నారు.

​సాయంత్రం 4:00 గంటలకు (చెన్నూరు):

చెన్నూరు పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ప్రాంగణంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిర్మించిన నూతన బస్తీ దవాఖానను మంత్రి గారు ప్రారంభించనున్నారు.

​మంత్రి గారి పర్యటన నేపథ్యంలో ఆయా మండలాల్లోని ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరడమైనది