BREAKING
వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి
Date of Publish : 15 July 2026, 03:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నీట్ లీకేజీపై కేంద్రాన్ని నిలదీయాలి: జులై 20న ‘చలో పార్లమెంట్’ విజయవంతం చేయండి – సీపీఐ(ఎంఎల్) లిబరేషన్

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jul, 2026 - 03:25 PM
151 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హరినాథ్ మాట్లాడుతూ, నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 21 రోజులుగా విద్యార్థి నాయకులు నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు.

ఎన్డీఏ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జులై 20న చేపట్టనున్న ‘చలో పార్లమెంట్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థి సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, అభ్యుదయ శక్తులు పెద్దఎత్తున పాల్గొని తమ నిరసన గళాన్ని వినిపించాలని కోరారు.

ఎండలో ఎండి, వర్షంలో తడుస్తూ విద్యార్థి నాయకులు దీక్షలు కొనసాగిస్తున్నా, కనీసం టెంట్లు ఏర్పాటు చేసుకునేందుకు కూడా అనుమతించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. గాంధేయ మార్గంలో శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్న సోనం వాంగ్‌చుక్, ఐసా విద్యార్థి నాయకురాలు నేహా సహా మరికొందరి ఆరోగ్య పరిస్థితి విషమించిందని, వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడే పరిస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్చలు ప్రారంభించి సమస్యకు పరిష్కారం చూపాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు చొరవ చూపాలని హరినాథ్ విజ్ఞప్తి చేశారు.