BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 30 May 2026, 07:32 pm
Posted by : V శ్రీనివాస్

​నిబంధనల ప్రకారమే వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
30 May, 2026 - 07:32 PM
228 వీక్షణలు

​నిబంధనల ప్రకారమే వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

​రైతులకు నష్టం వాటిల్లకుండా పారదర్శకంగా కొనుగోళ్లు

​కేంద్రాల వద్ద తాగునీరు, నీడ, గోనె సంచులు అందుబాటులో ఉంచాలి

​అధికారుల సమన్వయంతో లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలి​

రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు, నిల్వ, రవాణా ప్రక్రియలను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో గల రైస్ మిల్లులు, కొనుగోలు కేంద్రాలు, గోదాములను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం నిల్వ, తరలింపులో ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశిత సమయానికి అనుగుణంగా ధాన్యం ప్రక్రియను వేగవంతం చేయాలని, లక్ష్యాలను త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఇందులో భాగంగానే మొదటగా జిల్లా కేంద్రంలోని ఎ సి సి ప్రాంతంలో గల హనుమాన్ రైస్ మిల్లును సందర్శించి, అక్కడ జరుగుతున్న ధాన్యం దిగుమతి, నిల్వ ప్రక్రియలను నిశితంగా పరిశీలించి నిర్వాహకులకు తగిన సూచనలు చేశారు.

​అనంతరం మందమర్రి మండల కేంద్రంలోని శ్రీ వాసవి, అంబికా సాయి, సప్తగిరి రైస్ మిల్లులతో పాటు సారంగపల్లి, పొన్నారం గ్రామాలలో గల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల తహసిల్దార్ సతీష్ కుమార్ తో కలిసి కలెక్టర్ సందర్శించి ధాన్యం కొనుగోలు, నిల్వ, సి ఎం ఆర్ ప్రక్రియలను పరిశీలించారు. ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని, ఈ కొనుగోలు ప్రక్రియను ఎలాంటి అవాంతరాలు లేకుండా పారదర్శకంగా, వేగంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు త్రాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించడంతో పాటు గోనె సంచులు, టార్పాలిన్ కవర్లు, తూకం యంత్రాలు, ప్యాడీ క్లీనర్లను అందుబాటులో ఉంచాలన్నారు. కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన ధాన్యాన్ని, అలాగే సేకరించిన మొక్కజొన్నలను సైతం గోదాములలో సురక్షితంగా నిలువ చేయాలని స్పష్టం చేశారు.

​చివరగా నస్పూర్ మండలంలో గల స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ గోదామును మండల తహసిల్దార్ సంతోష్ కుమార్ తో కలిసి కలెక్టర్ సందర్శించారు. అక్కడ ధాన్యం భద్రత, నిల్వ ఏర్పాట్లను పరిశీలించి, లోడింగ్ మరియు అన్ లోడింగ్ ప్రక్రియలను వేగవంతం చేయడంపై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ పిలుపునిచ్చారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, రెవెన్యూ సిబ్బంది మరియు మిల్లుల నిర్వాహకులు పాల్గొన్నారు