BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 25 March 2026, 05:35 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నకిలీ సర్టిఫికెట్ల రాకెట్: ఐదుగురు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 05:35 AM
154 వీక్షణలు

నకిలీ సర్టిఫికెట్ల రాకెట్: ఐదుగురు అరెస్ట్

చిత్తూరు: పులిచెర్ల మండలంలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి కోర్టుల్లో షూరిటీలుగా వినియోగిస్తున్న ముఠాను పోలీసులు బహిరంగం చేశారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పులిచెర్ల ఎంపీడీవో రాజశేఖర్ బాబు ఫిర్యాదుపై ఈ నెల 18న కేసు నమోదు చేయగా, డీఎస్పీ సాయినాథ్ పర్యవేక్షణలో కల్లూరు సీఐ ఎం. జయరామయ్య, ఎస్సై వెంకటేశ్వర్లు దర్యాప్తు నిర్వహించారు. విచారణలో నిందితులు ఎం.పీ.డీ.వో కార్యాలయం, చిన్నగొట్టిగల్లు పంచాయతీ కార్యదర్శి పేర్లతో నకిలీ సీలు తయారు చేసి వాటితో నకిలీ సర్టిఫికెట్లు సిద్ధం చేస్తున్నట్టు బయటపడ్డాయి. ఈ పత్రాలను ఉపయోగించి తిరుపతి, పాకాల, పీలేరు, పుంగనూరు, చిత్తూరు కోర్టుల్లో వివిధ కేసుల్లో సుమారు 200 మందికి పైగా షూరిటీలను సమకూర్చినట్టు పోలీసులు తెలిపారు.

అరెస్ట్ చేసిన నిందితులు: డి. ఆంజనేయులు రామిరెడ్డి గారిపల్లి, పులిచెర్ల మండలం, సి. రవి రామిరెడ్డి గారిపల్లి, పులిచెర్ల మండలం, నీల వెంకటరమణ – జంగావాండ్లపల్లి, చిన్నగొట్టిగల్లు మండలం, పి. బ్రహ్మయ్య – గాంధీపురం, తిరుపతి, బాలసుబ్రమణ్యం – యాదవ కాలనీ, తిరుపతి. అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు పంపారు. కల్లూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్స్ ఆనందు, నాగరాజు, కానిస్టేబుల్స్ బావాజీ, మహేష్, వాసు, శ్రీనివాసులు కృషి చేసినందుకు డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.