BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 18 May 2026, 09:25 am
Posted by : కూనురు మధు

నకిరేకల్‌లో ఘనంగా మారథాన్ ర్యాలీ

తెలంగాణ
/ నల్గొండ / నకిరేకల్
18 May, 2026 - 09:25 AM
174 వీక్షణలు

నకిరేకల్‌లో ఘనంగా మారథాన్ ర్యాలీ: పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం NTODAY NEWS నకిరేకల్

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా కదలివచ్చిన జనం

* ​ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనే ధ్యేయం: ఎమ్మెల్యే పిలుపు

​
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా సోమవారం నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన మారథాన్ ర్యాలీ అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ఈ ర్యాలీలో స్వయంగా పాల్గొని యువతను, ప్రజలను  ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికీ చేరవేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. కేవలం పరిపాలనకే పరిమితం కాకుండా, ప్రజల శారీరక, మానసిక ఉల్లాసానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.
​ఆరోగ్య చైతన్యానికి మారథాన్ ఒక వేదిక అని, మారుతున్న జీవనశైలిలో యువత ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు, వ్యాయామం, మారథాన్ వంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయి. ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడంతో పాటు సామాజిక బాధ్యతను గుర్తు చేయడానికే ఈ ర్యాలీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గిరీశం తెలిపారు. ​ఈ మారథాన్ ర్యాలీకి పట్టణ ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, యువతీ యువకులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా అడుగులు వేస్తూ ఆరోగ్య సందేశాన్ని చాటారు.