BREAKING
292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి
www.ntodaynews.com

నల్గొండ జిల్లాలో పారిశ్రామిక మాక్ డ్రిల్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
19 May, 2026 - 06:48 AM
103 వీక్షణలు

నల్గొండ జిల్లాలో పారిశ్రామిక ‘మాక్ డ్రిల్’.. హాజరైన కలెక్టర్ చంద్రశేఖర్ NTODAY NEWS చిట్యాల 

ప్రమాదాలు సంభవించినప్పుడు మనల్ని మనం రక్షించుకుంటూనే ఎదుటివారిని కాపాడాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. పరిశ్రమలలో ప్రమాదాలు సంభవించినప్పుడు అత్యవసర ప్రతిస్పందన, సంసిద్ధత, వ్యవస్థలను బలోపేతం చేసే విషయమై జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థల ఆదేశాల మేరకు సోమవారం నల్గొండ జిల్లా, చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని వియాష్ సైంటిఫిక్ లిమిటెడ్ కంపెనీ (సైమ్ ల్యాబ్స్) లో నిర్వహించిన “మాక్ డ్రిల్” నమూనా విన్యాసానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

               జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఆదేశాల మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో వరదలు, అటవీ అగ్ని ప్రమాదాలు, పారిశ్రామిక ప్రమాదాలు సంభవించినప్పుడు జిల్లా యంత్రాంగాల ప్రతిస్పందన, సంసిద్ధతపై వివిధ జిల్లాలలో సంసిద్ధత కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లా పారిశ్రామిక ప్రమాదాల  ప్రతిస్పందన, సంసిద్ధతకు ఎంపిక కాగా, ఈ నమూనా కార్యక్రమాన్ని పిట్టంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని వియాస్ సైంటిఫిక్ లిమిటెడ్ కంపెనీలో నిర్వహించడం జరిగింది. 


          నమూనా విన్యాసాన్ని పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమలలో ప్రమాదాలు సంభవించినప్పుడు సంబంధిత కంపెనీ తక్షణమే స్పందించాలని, ఫైర్, వాటర్, వైద్య ఆరోగ్య శాఖల బృందాలు నిర్దేశించిన సమయంలో అప్రమత్తం కావాలన్నారు. ఒకరికొకరు సహకరించుకుంటూ వారిని వారు కాపాడుకుంటూనే ,తోటి వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాదాల సమయంలో అత్యవసర ప్రతిస్పందనతో పాటు, పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండడం, తద్వారా వ్యవస్థలను బలోపేతం చేసేందుకు నమూనా విన్యాసాలు ఉపయోగపడతాయన్నారు. దీని ద్వారా పరిశ్రమలలో ప్రమాదాలు సంభవించినప్పుడు ఉద్యోగులను ఏ విధంగా సంరక్షించుకోవాలో తెలుస్తుందని చెప్పారు. ఇలాంటి విన్యాసాల వల్ల ప్రమాదాలు సంభవించినప్పుడు చనిపోయేవారి సంఖ్యను పూర్తిగా తగ్గించడంతోపాటు, ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణ వైద్య చికిత్సలను అందించవచ్చని, తద్వారా సంఘటన సంభవించినప్పుడు ఎంతవరకు సిద్ధంగా ఉన్నామనే విషయం అర్థం అవుతుందన్నారు.

   ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీదేవి, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ సతీష్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

        సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు హైదరాబాద్ నుండి కార్యక్రమాన్ని  ఆన్ లైన్ లో పరిశీలించారు.