BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

నంద్యాలలో ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమావేశం - YCP

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
03 Apr, 2026 - 07:40 PM
97 వీక్షణలు

నంద్యాల నియోజకవర్గ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమావేశం..దిశా నిర్దేశం చేసిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి

ముగియనున్న స్థానిక సంస్థల పదవీకాలం - నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల ఆత్మీయ కలయిక ప్రాధాన్యతను సంతరించుకున్నది. నంద్యాల నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పదవీకాలం రేపటితో ముగియనున్న నేపథ్యంలో, నంద్యాల మరియు గోస్పాడు మండలాలకు చెందిన ఎంపీపీలు, సర్పంచ్‌లు, వైస్ సర్పంచ్‌లు మరియు ఎంపీటీసీలతో శుక్రవారం నగరంలోని స్థానిక అన్నపూర్ణ హోటల్‌ నందు భారీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష, మరియు మాజీ రాష్ట్ర మార్కెఫెడ్ చైర్మన్ పీపీ నాగిరెడ్డి పాల్గొని ప్రజాప్రతినిధులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి మాట్లాడుతూ, గత ఐదేళ్లుగా నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములైన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు.  రానున్న ఎన్నికలే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. వైసీపే నాయకత్వంలో అందించిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, రాబోయే ఎన్నికల్లో పార్టీ అత్యధిక మెజారిటీతో మళ్ళీ అధికారాన్ని చేపట్టేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం పరిశీలకుడు పీపీ మధుసూధన్ రెడ్డి,ఎంపీపీలు: శెట్టి ప్రభాకర్, ఆర్థర్ సైమన్, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు: రామసుబ్బారెడ్డి.   మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు: పురుషోత్తం రెడ్డి, మహేశ్వరరెడ్డి, వైసిపి జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, వైసీపీ జిల్లా కార్యదర్శి శివనాగిరెడ్డి,  నంద్యాల మండల అధ్యక్షుడు: బసవేశ్వరరెడ్డి, వైసీపీ నేత: ప్రహ్లాదరెడ్డి, సర్పంచులు  మరియు పెద్ద సంఖ్యలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమావేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.