BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 31 March 2026, 01:52 am
Posted by : యామనూరి మల్లికార్జున

నంద్యాలలో స్టార్ చిన్నపిల్లల,& పురిటి ఆసుపత్రి ప్రారంభిచిన NMD ఫరూక్

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
31 Mar, 2026 - 01:52 AM
144 వీక్షణలు

నంద్యాలలో ఘనంగా 'స్టార్ పురిటి మరియు చిన్న పిల్లల ఆసుపత్రి' ప్రారంభం


ముఖ్య అతిథిగా విచ్చేసి ఆసుపత్రిని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్

నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన "స్టార్ చిల్డ్రన్స్ హాస్పిటల్" (స్టార్ పురిటి మరియు చిన్న పిల్లల ఆసుపత్రి) సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిని ప్రారంభించారు.


​​ఈ సందర్భంగా మంత్రి ఫరూక్  మాట్లాడుతూ నంద్యాల వంటి ఎదుగుతున్న పట్టణాల్లో చిన్నపిల్లలకు ప్రత్యేకమైన, అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రావడం శుభపరిణామమని అన్నారు. చెన్నైలోని మెహతా హాస్పిటల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో శిక్షణ పొందిన డాక్టర్ కార్తికేయ కుమార్ వంటి నిపుణులు ఇక్కడ సేవలు అందించడం వల్ల, అత్యవసర స్థితిలో ఉన్న శిశువులను వేరే నగరాలకు తీసుకెళ్లే అవసరం తగ్గుతుందని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించాలని, మానవీయ కోణంలో రోగులను సేవించాలని ఆసుపత్రి యాజమాన్యానికి మంత్రి ఫరూక్ సూచించారు.


​ఆసుపత్రి అధినేత డాక్టర్ కార్తికేయ కుమ్మిత మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో పురిటి సేవలతో పాటు, తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు (Neonatology) ప్రత్యేక చికిత్సలు, 24 గంటల ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. తమపై నమ్మకంతో విచ్చేసిన అతిథులకు, పట్టణ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, డాక్టర్ ప్రియాం కుమ్మిత, కుమ్మితి శ్రీనివాసులు , డాక్టర్ రవి కృష్ణ, మనం వినయ్ కుమార్ , మిద్దె హుస్సేన్ , ఇంజనీర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు