నూజివీడు: అప్పారావు కాలనీ ఆర్చి పేరుపై వైసీపీ ఆందోళన
ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని ఎమ్మార్ అప్పారావు కాలనీ వద్ద వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన చేపట్టారు.
ఎమ్మార్ అప్పారావు కాలనీ ప్రవేశ ఆర్చి వద్ద ఏర్పాటు చేసిన పేరులో కొలుసు పార్థసారథి సౌజన్యంతో అన్న పదాలను తొలగించాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. కాలనీ పేరుకు సంబంధించిన అంశంలో రాజకీయ జోక్యాన్ని అంగీకరించబోమని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ.. కాలనీ ఆర్చి పేరులో మార్పులు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఆర్చి వద్ద ఉన్న వివాదాస్పద పేరును తొలగించాలని డిమాండ్ చేశారు.
ఆందోళన నేపథ్యంలో ఎమ్మార్ అప్పారావు కాలనీ వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు.