BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 02 May 2026, 04:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నూజివీడు నియోజకవర్గంలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 May, 2026 - 04:46 PM
212 వీక్షణలు

నూజివీడు నియోజకవర్గంలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా ఆరోపణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పిడిఎస్) బియ్యం అక్రమ రవాణా యదేచ్ఛగా సాగుతోందన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో ఈ అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికంగా చర్చ కొనసాగుతోంది.

కొంతమంది అక్రమ రవాణాదారులు పలు రైస్ మిల్లులను లీజుకు తీసుకుని, అక్కడ పిడిఎస్ బియ్యాన్ని పాలిష్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. కొన్ని నెలల క్రితం మిల్లుల్లో పిడిఎస్ బియ్యం పట్టుబడిన ఘటనలు వెలుగులోకి రావడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది.

పట్టుబడుతున్న పరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ, వాస్తవానికి భారీ స్థాయిలో అక్రమ రవాణా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా చాట్రాయి మండలం పరిధిలోని చిన్నంపేట, సి.గుడిపాడు, మర్లపాలెం గ్రామాల్లో స్ధావరాలు ఏర్పాటు చేసుకుని ఈ దందా కొనసాగుతోందని చెబుతున్నారు.

చిన్నంపేట గ్రామంలోని ఒక పెట్రోలు బంకు వద్ద నెంబర్ లేని వాహనాలు తరచూ నిలిపి ఉంచి పిడిఎస్ బియ్యాన్ని తరలిస్తున్న ఘటనలు గమనించబడ్డాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై పోలీసులు, ఫౌరసరఫరాల శాఖ అధికారులు సమన్వయంతో కఠిన చర్యలు తీసుకుంటే అక్రమ రవాణాను అరికట్టవచ్చని ప్రజలు కోరుతున్నారు.