BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 20 April 2026, 06:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నవోదయం 2.0 దాడి – నాటు సారా నిర్మూలనకు కఠిన చర్యలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Apr, 2026 - 06:40 PM
156 వీక్షణలు

నూజివీడు: నవోదయం 2.0 దాడి – నాటు సారా నిర్మూలనకు కఠిన చర్యలు

ఏలూరు జిల్లా నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారా నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవోదయం 2.0 కార్యక్రమం కింద చర్యలు కొనసాగుతున్నాయి. చాట్రాయి మండలం పోతనపల్లి పెద్ద తండా గ్రామంలో నిర్వహించిన దాడిలో సారా తయారికి సిద్ధంగా ఉంచిన 100 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి 3 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన గోపాల్ పై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ. మస్తానయ్య తెలిపారు. నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాల్లో నాటు సారా తయారీ, బెల్ట్ షాపుల నిర్వహణపై కఠిన చర్యలు కొనసాగుతాయని, సారా తయారీకి బెల్లం సరఫరా చేసే వ్యాపారులు మరియు బెల్లపు ఊట కలిగి ఉన్న భూ యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. నాటు సారా కార్యకలాపాలపై సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, సమాచారం అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.