BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 21 March 2026, 01:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నూజివీడులో అనుమానాస్పద మృతి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Mar, 2026 - 01:49 PM
356 వీక్షణలు

నూజివీడులో అనుమానాస్పద మృతి: జనసైనిక కుటుంబానికి జనసేన నాయకుల ఆప్త సంరక్షణ

శుక్రవారం నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామానికి చెందిన జనసైనికుడు కొప్పాక డేవిడ్ అజయ్ అనుమానాస్పదంగా మృతి చెందారు. గత రెండు రోజుల క్రితం నూజివీడు పట్టణంలోని స్థానిక షెడ్‌లో పనిచేస్తూ యాక్సిడెంటల్‌గా జరిగిన ఈ ఘటన స్థానికులు తెలిసిన వెంటనే శోకంలో మునిగిపోయారు.

ఈ విషయంలో నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ, నూజివీడు మండల అధ్యక్షుడు యర్రంశెట్టి రాము, నియోజకవర్గ నాయకులు ముమ్మలనేని సునీల్ కుమార్, రాజు, కూటమి నాయకులు, గ్రామ తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మాదాసు పుల్లయ్య, చింతా అనిల్ గౌడ్, రేపాక రాజు, మరియు స్థానిక జనసేన కార్యకర్తలు వెంటనే కుటుంబాన్ని పరామర్శించారు.

నాయకులు కుటుంబ సభ్యులని ఓదార్చి, “మీ కుటుంబం కోసం ఎల్లప్పుడూ అండగా నిలుస్తాం. ఈ సమయంలో మాత్రమే కాదు, భవిష్యత్‌లో కూడా మేము మీతో ఉంటాం” అని భరోసా ఇచ్చారు.

ఈ సంఘటనలో జనసేన పార్టీ నూజివీడు కార్యాలయం, ద్వారక థియేటర్ ఎదురు వద్ద నివాసం కలిగిన సభ్యులు కలిసిపోయి కుటుంబానికి మానసిక ఆప్యాయత చూపించారు.