BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 03 August 2026, 02:29 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నరసింహారావుపాలెం బీసీ కాలనీలో నీటి కేకలు మూడు నెలలుగా తాగునీరు, వినియోగ నీరు లేక అవస్థలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Aug, 2026 - 02:29 PM
350 వీక్షణలు

రోడ్డెక్కి నిరసన తెలిపిన కాలనీ వాసులు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం నరసింహారావుపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని బీసీ కాలనీ ప్రజలు తీవ్ర నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. గత మూడు నెలలుగా తాగునీటితో పాటు నిత్యావసరాల కోసం వినియోగించే నీరు కూడా సరఫరా కాకపోవడంతో కాలనీ వాసుల జీవనం దుర్భరంగా మారింది. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాకపోవడంతో సోమవారం కాలనీ ప్రజలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు.

ఇంటి అవసరాలకు, తాగునీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని వారు అధికారులను డిమాండ్ చేశారు.

ఈ విషయంపై ఎన్ టు డే న్యూస్ నరసింహారావుపాలెం పంచాయతీ స్పెషల్ ఆఫీసర్, మండల అభివృద్ధి అధికారి ఏబి సత్యనారాయణను వివరణ కోరగా, సమస్య తన దృష్టికి వచ్చిందని తెలిపారు. అవసరమైన చర్యలు చేపట్టి రెండు నుంచి మూడు రోజుల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. నరసింహారావుపాలెం టీడీపీ యువనేత పీఏసియస్ ఛైర్పర్సన్ కట్టా నాగ దుర్గా రావు  ఎన్ టు డే న్యూస్ తో మాట్లాడుతూ ఈ రోజు నూతన బోరు బావి వేయించి మోటారు బిగించి శాశ్వత పరిష్కారం చేయిస్తానని హామీ ఇచ్చారు 

అయితే, ఇచ్చిన హామీ ప్రకారం అధికారులు, కట్టా నాగ దుర్గా రావు వెంటనే చర్యలు తీసుకుని కాలనీ ప్రజల నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.