BREAKING
హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
Date of Publish : 28 February 2026, 06:40 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

తెలంగాణ
28 Feb, 2026 - 06:40 AM
304 వీక్షణలు
  కరసనపల్లె జెడ్పీహెచ్‌ఎస్‌లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం NTODAY NEWS: పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్రరాజు సి.వి. రామన్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచన అన్నమయ్య జిల్లా, పుంగనూరు: కరసనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ శాస్త్రీయ ప్రదర్శనలు, పోటీలతో కార్యక్రమాన్ని ఆకర్షణీయంగా మార్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అమర్నాథ్ మాట్లాడుతూ, నేటి విద్యార్థులే రేపటి భారత పౌరులని పేర్కొన్నారు. శాస్త్రవేత్త సి.వి. రామన్‌ను ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు చార్ట్స్, మోడల్స్, వర్కింగ్ మోడల్స్‌ను వినూత్నంగా రూపొందించి ప్రదర్శించారని తెలిపారు. వర్షపు నీటి సంరక్షణ, నీటి శుద్ధి విధానం, మొక్కల ఆహార తయారీ ప్రక్రియ, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, వ్యర్థాల నిర్వహణ, గ్లోబలైజేషన్ వంటి అంశాలపై ప్రదర్శనలు ఆకట్టుకున్నాయని వివరించారు. కార్యక్రమంలో భాగంగా వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీలు నిర్వహించి, ఉత్తమ ప్రదర్శనలు చేసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగ మంజరి, మనోహర్, ప్రేమ కుమార్, రామాంజులు, భాస్కర్, శ్రీనివాసన్, ప్రసూన మరియు విద్యార్థులు పాల్గొన్నారు. #NationalScienceDay #ZPHS #Karasanapalle #Punganur #AnnamayyaDistrict #ScienceEducation Follow us on Website Facebook Instagram YouTube