BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 23 June 2026, 07:46 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

న్యాయమూర్తుల నియామకాల్లో జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:46 AM
114 వీక్షణలు

న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టు కొలీజియంలు తీసుకునే నిర్ణయాల్లో న్యాయపరంగా జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం సీనియారిటీ ఉన్నంత మాత్రాన న్యాయమూర్తి పదోన్నతి పొందే హక్కు ఎవరికీ ఉండదని తేల్చిచెప్పింది.

తనకంటే జూనియర్లను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించడాన్ని సవాలు చేస్తూ హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

ఈ కేసును సోమవారం విచారించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కొలీజియం తీసుకున్న నిర్ణయాలను తిరిగి పరిశీలించడం ద్వారా కొత్త వివాదాలకు తాము తెరతీయదలచుకోలేదని పేర్కొంది. న్యాయమూర్తుల ఎంపిక, పదోన్నతుల విషయంలో కొలీజియంకు ఉన్న అధికారాలను గౌరవించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

అలాగే పిటిషనర్‌కు ఇంకా పదేళ్ల సర్వీసు మిగిలి ఉన్నందున ఓపికగా వేచి ఉండాలని, భవిష్యత్తులో పదోన్నతి అవకాశం లభించే అవకాశముందని సూచించింది. ఈ సందర్భంగా సీనియారిటీ ఒక్కటే పదోన్నతికి ప్రమాణం కాదని, ఇతర అంశాలు కూడా పరిగణనలోకి తీసుకుంటారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.