BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 20 February 2026, 08:44 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

భ్రమరాంబాదేవికి కొబ్బరికాయల సమర్పణ

తెలంగాణ
20 Feb, 2026 - 08:44 PM
268 వీక్షణలు
భ్రమరాంబాదేవికి కొబ్బరికాయల సమర్పణ NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున చైత్రమాసంలో పౌర్ణమి అనంతరం భ్రమరాంబాదేవికి కుంభోత్సవం నిర్వహించడం సంప్రదాయం. ఈ ఏడాది కుంభోత్సవాన్ని ఏప్రిల్ 7న నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యాలయం ప్రకటించింది. కుంభోత్సవం సందర్భంగా సాత్త్విక బలి రూపంలో కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు తదితర ఫలాలను సమర్పించడం ఆనవాయితీ. కుంభోత్సవం రోజున స్త్రీ వేషధారణలో ఉన్న పురుషుడు కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టంగా ఉంటుంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం ప్రతి మంగళవారం, శుక్రవారం భ్రమరాంబాదేవికి కొబ్బరికాయలు సమర్పించే కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 20న ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించారు. అనంతరం వాటిని అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమం కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు నిర్వహించబడినట్లు దేవస్థానం వర్గాలు వెల్లడించాయి. #Srisailam #BhramarambaDevi #TempleRituals #Kumbhotsavam #AndhraPradesh #SpiritualNews #HinduTraditions Follow us on Website Facebook Instagram YouTube