BREAKING
హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
Date of Publish : 29 March 2026, 03:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఒకరి మరణం… పలువురికి జీవం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 03:05 PM
242 వీక్షణలు

అవయవ దానం గొప్పతనానికి నిలువెత్తు ఉదాహరణ 

అవయవ దానం… మరణానికైనా మానవత్వం!

జంగారెడ్డిగూడెం:

ప్రతి ఒక్కరూ అవయవ దానం పట్ల అవగాహన కలిగి ఉండాలని గుంటూరు కిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వినోద్ పేర్కొన్నారు. ఇటీవల పట్టణానికి చెందిన నాయుడు మధుశ్రీ బ్రెయిన్ డెడ్ అయిన నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు చేసిన అవయవ దానం ఎంతో ఆదర్శప్రాయమని ఆయన అభినందించారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు జీవన్ దాన్ సంయుక్తంగా నాయుడు మధుశ్రీ కుటుంబ సభ్యులకు శనివారం అవయవ దానం డోనర్ సర్టిఫికెట్‌ను అందజేశారు.

డాక్టర్ వినోద్ మాట్లాడుతూ—కుమార్తె మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులు చూపిన మహోన్నత నిర్ణయం అనేకమందికి కొత్త జీవితం ప్రసాదించిందన్నారు. మధుశ్రీ ఊపిరితిత్తులు, లివర్, మూత్రపిండాలు, కళ్ళు దానం చేయడం ద్వారా పలువురి జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డోనర్ సర్టిఫికెట్‌ను తండ్రి సత్యనారాయణకు, సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ మరియు మేనమామ వీరమల్ల మధుకి అందజేశారు.

అవయవ దానం – ఒకరి ముగింపు, మరొకరికి ఆరంభం.