BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 13 May 2026, 09:58 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఊపిరి పీల్చుకున్న విజయ్.. భారీ విజయం.. ఇక ఢోకా లేనట్టే..!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 May, 2026 - 09:58 PM
129 వీక్షణలు

తమిళనాడు రాజకీయాల్లో సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన టీవీకే అధినేత విజయ్ మరో కీలక పరీక్షలో ఘన విజయం సాధించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు ఎన్నో రాజకీయ ఒత్తిళ్లు, వ్యూహాత్మక సవాళ్లు ఎదుర్కొన్న విజయ్.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అడుగడుగునా పరీక్షలను ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే ప్రతి పరీక్షను విజయవంతంగా దాటుకుంటూ తన రాజకీయ పట్టును మరింత బలంగా చాటుకుంటున్నారు.

ముఖ్యమంత్రిగా ఇటీవల చేసిన తొలి ప్రసంగంతోనే అసెంబ్లీలో తన దూకుడు చూపించిన విజయ్.. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లోనూ తన వ్యూహాన్ని సక్సెస్ చేశారు. తన పార్టీకి చెందిన నేతలకే ఆ కీలక పదవులు దక్కేలా చేసి ప్రత్యర్థులకు షాక్ ఇచ్చారు.

ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన విశ్వాస పరీక్షలోనూ విజయ్ సత్తా చాటారు. బుధవారం తమిళనాడు అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో టీవీకే ప్రభుత్వానికి ఏకంగా 144 ఓట్లు లభించాయి. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, వీసీకేతో పాటు అన్నాడీఎంకేకు చెందిన కొంతమంది రెబల్ ఎమ్మెల్యేలు కూడా విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు.

ఇక అన్నాడీఎంకేకు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటు వేయగా, డీఎంకే మాత్రం ఓటింగ్‌కు దూరంగా ఉండి వాక్‌అవుట్ చేసింది. దీంతో అసెంబ్లీలో విజయ్ బలం మరింత స్పష్టమైంది.

భారీ మెజారిటీతో విశ్వాస పరీక్షను గెలుచుకోవడంతో విజయ్ ప్రభుత్వం మరింత స్థిరపడిందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తం చేసిన ప్రత్యర్థులకు ఈ ఫలితం గట్టి సమాధానంగా మారింది. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో విజయ్ దూకుడు హాట్ టాపిక్‌గా మారింది.