BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 10 April 2026, 09:49 pm
Posted by : బోధపల్లి వేణు

పాడి పరిశ్రమ ప్రారంభించిన స్థానిక శాసన సభ్యురాలు

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
10 Apr, 2026 - 09:49 PM
158 వీక్షణలు

పాడి పరిశ్రమ విజయ డెయిరీ పాల ఉత్పత్తిదారుల సహకార భవనాన్ని ప్రారంభించిన స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి..

దేవరుప్పుల మండల కేంద్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి కీలకమైన అడుగుగా విజయ డెయిరీ పాల ఉత్పత్తిదారుల సహకార భవనాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి , తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమైక్య లిమిటెడ్ (TSDDCF) చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమ రైతులకు అదనపు ఆదాయ వనరుగా మారుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం పాడి రైతులకు ప్రోత్సాహకాలు, సబ్సిడీలు అందిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. కొత్తగా ప్రారంభమైన ఈ సహకార భవనం ద్వారా పాల సేకరణ, నిల్వ, పంపిణీ వంటి సేవలు ఒకే చోట అందుబాటులోకి వచ్చి రైతులకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.

తద్వారా రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా డెయిరీ ద్వారా మంచి ధరలు పొందే అవకాశముంటుందని, మహిళా సంఘాలు కూడా పాడి పరిశ్రమలో భాగస్వామ్యం కావడం ద్వారా ఆర్థికంగా బలపడతాయని ఎమ్మెల్యే తెలిపారు..

చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి గారు మాట్లాడుతూ, తెలంగాణలో పాడి పరిశ్రమను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. విజయ డెయిరీ ద్వారా రైతులకు పారదర్శకంగా సేవలు అందిస్తూ, నాణ్యమైన పాల ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తున్నామని తెలిపారు. ఈ సహకార భవనం పాడి రైతుల అభివృద్ధికి కేంద్రంగా మారి, మరింత మంది రైతులను ఈ రంగంలోకి తీసుకురావడానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు..

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, డెయిరీ సంఘ సభ్యులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భవనం ప్రారంభంతో దేవరుప్పుల మండలంలో పాడి పరిశ్రమకు కొత్త ఊపు వచ్చి, రైతుల జీవనోపాధి మెరుగుపడుతుందని ఆశిస్తున్నారు..