BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 04 April 2026, 10:36 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పాకాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి అనుమానాస్పద మృతి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
04 Apr, 2026 - 10:36 PM
219 వీక్షణలు

పాకాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి అనుమానాస్పద మృతి ఘటన వెలుగులోకి....

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పోలీస్ స్టేషన్ సీఐ టి.చిన్న గోవిందు మాట్లాడుతూ చంద్రగిరి మండలం,తొండవాడ గ్రామానికి చెందిన చలమచర్ల ప్రవీణ్ కుమార్(46)అతను మార్చి 28వ తేదీ నాడు తన కుటుంబ సభ్యులకు తెలియజేసి,పాకాల మండలం,పులివర్తివారిపల్లి గ్రామంలో ఉన్న తమ మామిడి తోటకు వెళ్లినట్లు తెలిసింది.

అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో ఏప్రిల్ రెండవ తేదీ వరకు ఫోన్ ద్వారా సంప్రదింపులో ఉన్నారు.అయితే ఏప్రిల్ మూడవ తేదీ నుండి ఆయన ఫోన్‌కు స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది,శనివారం నాడు పొలం లీజుదారు ద్వారా పరిశీలించగా,మామిడి తోటలోని ఒక షెడ్ సమీపంలో అరుగు పై ఆయన మృతి చెందిన స్థితిలో ఉన్నట్లు సమాచారం అందింది.

వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని పరిశీలించగా,మృతదేహం ఉబ్బిపోయిన స్థితిలో ఉండడం,దుస్తులు సరిగా లేకపోవడం మరియు అనుమానాస్పద పరిస్థితులు కనిపించడం గమనించారు.స్థానికుల సమాచారం మేరకు,2026 మార్చి 30వ తేదీ మృతుడు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి అదే తోటలో మద్యం సేవిస్తున్నట్లు గుర్తించబడింది.

ఈ మేరకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పాకాల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించబడింది.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించబడింది.పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మృతి కారణం నిర్ధారించబడుతుంది.

ఈ ఘటనపై అన్ని కోణాలలో దర్యాప్తు చేపట్టి,సంబంధిత వ్యక్తులను గుర్తించి,అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.