BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 29 May 2026, 03:38 pm
Posted by : బోధపల్లి వేణు

పాలకుర్తి నియోజకవర్గం లో జాబ్ మేళా

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
29 May, 2026 - 03:38 PM
292 వీక్షణలు

NTODAYNEWS పాలకుర్తి నియోజకవర్గం:

పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర స్వామి కళ్యాణ మండపంలో హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్, టీపీసీ‌సీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు స్థానిక నాయకులతో కలిసి ఘనంగా ప్రారంభించారు.

ఈసందర్భంగా ట్రస్ట్ చైర్మన్ మరియు ఫౌండర్ ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ.యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఇది మంచి వేదికగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. చదువు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ప్రైవేట్ రంగంలో అవకాశాలు కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని వారు అన్నారు..

ఈ మెగా జాబ్ మేళాలో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థుల అర్హతలను పరిశీలించి ఇంటర్వ్యూలు నిర్వహించాయి. 10వ తరగతి, ఇంటర్ డిగ్రీ , పీజీ పూర్తి చేసిన యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉదయం నుంచే యువత కళ్యాణ మండపానికి భారీగా చేరుకొని తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.

జాబ్ మేళా ప్రాంగణంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాలంటీర్లు సహాయం అందించారు. యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా కెరీర్ గైడెన్స్, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు.

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరం. నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు మా ట్రస్ట్ తరపున భవిష్యత్తులో కూడా మరిన్ని ఉపాధి కార్యక్రమాలు నిర్వహిస్తాము అని తెలిపారు

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, ట్రస్ట్ సభ్యులు, వాలంటీర్లు మరియు పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొన్నారు..