BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 21 March 2026, 06:31 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పామాయిల్ రైతుల ఆత్మీయ నాయకుడు కావూరి సాంబశివరావుకు ఘన నివాళి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Mar, 2026 - 06:31 AM
145 వీక్షణలు

పామాయిల్ రైతుల ఆత్మీయ నాయకుడు కావూరి సాంబశివరావుకు ఘన నివాళి

ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం ఎర్రగుంటపల్లి గ్రామంలో శుక్రవారం గోద్రెజ్ ఫ్యాక్టరీ పరిధిలోని ఆయిల్ పామ్ రైతులు ఇటీవల మరణించిన కావూరి సాంబశివరావుకు సంతాప సభ నిర్వహించారు. పామాయిల్ పంట అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా రైతులు స్మరించుకున్నారు.

పామాయిల్ రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పెనుమత్స రామరాజు మాట్లాడుతూ, పామాయిల్ పంటను అభివృద్ధి చేయడంలో కావూరి సాంబశివరావు ఎనలేని కృషి చేశారని కొనియాడారు. రైతులకు గిట్టుబాటు ధర సాధనలో ఆయన పోషించిన పాత్ర అపూర్వమని పేర్కొన్నారు. పామాయిల్ పంటకు ఈ స్థాయి మార్కెట్ ఏర్పడటానికి ఆయన కృషి ప్రధాన కారణమని అన్నారు.

ఈ సందర్భంగా పలువురు రైతులు ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. రైతుల హక్కుల సాధన కోసం జీవితాంతం పోరాడిన నాయకుడిగా కావూరి సాంబశివరావును స్మరించారు.

ఈ సమావేశం పామాయిల్ అసోసియేషన్ అధ్యక్షులు పెనుమత్స రామరాజు అధ్యక్షతన జరిగింది.