BREAKING
thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన..
Date of Publish : 23 June 2026, 07:33 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పార్వతీపురం మన్యం జిల్లాలో గజరాజుల సంచారం.. రైతుల్లో ఆందోళన

ఆంధ్రప్రదేశ్
/ పార్వతీపురం మన్యం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:33 PM
101 వీక్షణలు

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల సంచారం స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా సాలూరు, పార్వతీపురం నియోజకవర్గాల పరిధిలో సంచరిస్తున్న గజరాజులు, సోమవారం రాత్రి సీతానగరం మండలం గుచ్చిమి గ్రామంలో ప్రత్యక్షమయ్యాయి.

గ్రామ పరిసరాల్లోకి వచ్చిన ఏనుగులు రెండు వరి కోత యంత్రాలను ధ్వంసం చేశాయి. ఇటీవల పామాయిల్ తోటలు, వ్యవసాయ మోటార్లను కూడా నాశనం చేసినట్లు రైతులు చెబుతున్నారు.

అటవీ ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లోనూ ఏనుగులు సంచరిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంటలు, వ్యవసాయ పరికరాలకు నష్టం వాటిల్లడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రజలు మరియు రైతుల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు అటవీ శాఖ తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.