BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్
Date of Publish : 29 June 2026, 04:10 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 10 మంది అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jun, 2026 - 04:10 PM
151 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు మండలం ఎం.ఎన్. పాలెం గ్రామంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై నూజివీడు రూరల్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి 10 మందిని అరెస్ట్ చేశారు.

ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలు, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ సూచనలు, నూజివీడు రూరల్ సీఐ ఐ.వి. నాగేంద్ర కుమార్ పర్యవేక్షణలో రూరల్ ఎస్ఐ జి. జ్యోతిబసు పోలీసు సిబ్బందితో కలిసి ఈ దాడులు చేపట్టారు.

దాడిలో నిందితుల వద్ద నుంచి రూ.17,390 నగదు, 9 మోటార్ సైకిళ్లు, 9 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసి తదుపరి న్యాయపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

జూదం, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తాయని, ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.

ప్రజలు తమ పరిసరాల్లో పేకాట, జూదం లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే డయల్-112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు వెల్లడించారు.