BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 25 June 2026, 07:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పచ్చిరొట్ట పైర్లతో భూసారం పెంపు.. రైతులకు చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ కీలక సూచనలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 07:17 PM
141 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయిలో పచ్చిరొట్ట పైర్ల సాగు ద్వారా భూసారాన్ని పెంపొందించుకోవాలని రైతులకు చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ సూచించారు. తొలకరిలో వరి మరియు ఇతర పంటలు సాగు చేసే రైతులు పెసలు, అలసంద, జనుము, జీలుగా, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట పైర్లను పూత దశకు ముందే కలియదున్నడం వల్ల భూమిలో సేంద్రీయ కర్బనం పెరిగి, నేల సారం గణనీయంగా మెరుగుపడుతుందని తెలిపారు.

అలాగే అజోస్పైరిల్లం, పాస్పో బ్యాక్టీరియా వంటి జీవన ఎరువులను ఎకరానికి 2 నుంచి 3 కిలోల చొప్పున వినియోగించడం ద్వారా రసాయనిక ఎరువుల అవసరాన్ని తగ్గించుకోవచ్చని చెప్పారు. పశువుల ఎరువు, కంపోస్టు, పంట అవశేషాలను ఎకరానికి నాలుగు టన్నుల మేర వాడటం వల్ల భూమి భౌతిక, రసాయనిక, జీవ లక్షణాలు మెరుగుపడి అధిక దిగుబడులకు దోహదపడుతాయని వివరించారు.

ముఖ్యంగా పొటాష్ లోపం ఉన్న పొలాల్లో పొటాష్ అధికంగా ఉండే వరిగడ్డిని తొక్కించడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. సేంద్రియ ఎరువుల వినియోగం ద్వారా హెక్టారుకు 20 నుంచి 40 కిలోల నత్రజని, 10 నుంచి 15 కిలోల భాస్వరం, 30 నుంచి 40 కిలోల పొటాష్ లభిస్తాయని వెల్లడించారు.

ఈ సందర్భంగా చాట్రాయిలో పచ్చిరొట్ట పైర్లు సాగు చేసిన వరి పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన వ్యవసాయ అధికారి బి. శివశంకర్, రైతులకు భూసార పరిరక్షణ, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. భూమి ఆరోగ్యమే రైతు సంపదకు పునాది అని, పచ్చిరొట్ట పైర్ల సాగు భవిష్యత్‌లో అధిక దిగుబడులకు బాటలు వేస్తుందని పేర్కొన్నారు.