BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 20 March 2026, 04:53 pm
Posted by : కూనురు మధు

​పెండింగ్ చలాన్లు ఉంటే లైసెన్స్, ఆర్సీ కట్!

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
20 Mar, 2026 - 04:53 PM
312 వీక్షణలు

​పెండింగ్ చలాన్లు ఉంటే లైసెన్స్, ఆర్సీ కట్!​

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి, జరిమానాలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న వాహనదారుల పట్ల తెలంగాణ రవాణా శాఖ సీరియస్ అయ్యింది. చలాన్లు చెల్లించని పక్షంలో సదరు వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్‌ను మరియు వాహన రిజిస్ట్రేషన్ కార్డు (RC)ను ఫ్రీజ్ చేసే నూతన విధానాన్ని అమలులోకి తీసుకురానుంది. ఇందులో ముఖ్యంగా  ఆర్సీ లేదా లైసెన్స్ ఫ్రీజ్ అయితే, ఆ వాహనాన్ని విక్రయించడం, యజమాని పేరు మార్చడం లేదా ఇతర రవాణా శాఖ సేవలు పొందడం సాధ్యం కాదు. జరిమానాలపై ఏవైనా అభ్యంతరాలు లేదా పొరపాట్లు ఉంటే, వాటిని ఫిర్యాదు చేయడానికి ప్రత్యేకంగా ఈ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా పారదర్శకంగా సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

​త్వరలో నోటిఫికేషన్: ఈ కొత్త విధానానికి సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ మరో కొద్ది రోజుల్లోనే విడుదల కానుంది. ఇందులో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే భారీగా చలాన్లు పేరుకుపోయిన వాహనదారులు వెంటనే వాటిని చెల్లించి, భవిష్యత్తులో ఎదురయ్యే చట్టపరమైన ఇబ్బందుల నుండి తప్పుకోవడం ఉత్తమం.