BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 08 June 2026, 03:26 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jun, 2026 - 03:26 PM
99 వీక్షణలు

పెనమలూరు, 08/06/2026:

పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్ల ప్రవర్తనలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఆదివారం కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సమావేశానికి స్టేషన్ ఇంచార్జ్ CI N. వెంకటనారాయణ ఆధ్వర్యం వహించారు.

స్ధానిక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లందరినీ పిలిపించి వారి ప్రస్తుత జీవన విధానం, కార్యకలాపాలపై వివరంగా ఆరా తీసారు.

ఈ సందర్భంగా CI మాట్లాడుతూ, సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పాత నేర ప్రవర్తన, అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా మానుకుని, సామాన్య పౌరుల్లా బాధ్యతాయుతంగా జీవించాలన్నారు. చట్ట వ్యతిరేక పనులకు దూరంగా ఉండి, కుటుంబాలతో ప్రశాంతమైన జీవితం గడపాలని సూచించారు.

ఇకపైనా ఎవరు గొడవలకు దిగితే, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే P.D. యాక్ట్ కూడా నమోదు చేయడానికి వెనుకాడబోమని CI స్పష్టం చేశారు.