BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 29 June 2026, 03:44 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలను గ్రంథాలయంలో జాతీయ గణాంక దినోత్సవం ఘనంగా నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jun, 2026 - 03:44 PM
125 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను శాఖా గ్రంథాలయంలో సోమవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో జాతీయ గణాంక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆధునిక భారత గణాంక పితామహుడు ప్రశాంత చంద్ర మహలనోబిస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం నిర్వహించిన సభలో కాన్వెంట్ ప్రిన్సిపాల్ తోట నాగరాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 29న మహలనోబిస్ జయంతిని దేశవ్యాప్తంగా జాతీయ గణాంక దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రణాళికా సంఘం ఏర్పాటులో, రెండవ పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారని వివరించారు.

గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో గణాంకాల ప్రాధాన్యం మరింత పెరిగిందని, సరైన గణాంకాలు లేకపోతే అభివృద్ధి కుంటుపడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి చిరుమామిళ్ల వెంకటనారాయణ, హైస్కూల్ పూర్వ విద్యార్థి వనమా రామ్మూర్తి, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.