BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 04 August 2026, 02:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఘనంగా పెనుగొలనులో దివిసీమ గాంధీ మండలి వెంకటకృష్ణారావు శత జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Aug, 2026 - 02:34 PM
99 వీక్షణలు

ఘనంగా పెనుగొలనులో దివిసీమ గాంధీ మండలి వెంకటకృష్ణారావు శత జయంతి వేడుకలు 

గంపలగూడెం, ఆగస్టు 4: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామ గ్రంథాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రజానాయకుడు దివిసీమ గాంధీ మండలి వెంకటకృష్ణారావు శత జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మండలి వెంకటకృష్ణారావు స్వాతంత్ర్య సమరయోధుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, విద్య, సాంస్కృతిక, సాంఘిక సంక్షేమ, మత్స్య సహకార శాఖల మంత్రిగా విశిష్ట సేవలు అందించారని కొనియాడారు.

1975లో జరిగిన తొలి ప్రపంచ తెలుగు మహాసభలకు సారథ్యం వహించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి తెలుగు భాష, సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడిగా ఆయన నిలిచారని పేర్కొన్నారు. అలాగే అంతర్జాతీయ తెలుగు సంస్థ అధ్యక్షుడిగా 1981లో మలేషియాలో నిర్వహించిన ద్వితీయ ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించి తెలుగు జాతికి విశిష్ట సేవలు అందించారని గుర్తుచేశారు.

కాన్వెంట్ ప్రిన్సిపాల్ తోట నాగరాజు మాట్లాడుతూ, 1977 దివిసీమ ఉప్పెన సమయంలో వేలాది మంది బాధితులకు అండగా నిలిచి ప్రజల హృదయాల్లో **"దివిసీమ గాంధీ"**గా చిరస్థాయిగా నిలిచారని అన్నారు. ప్రజలే రాజకీయాల కేంద్రబిందువని విశ్వసిస్తూ జీవితాంతం ప్రజాసేవకు అంకితమైన ఆయన జీవితం భావితరాలకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.

అనంతరం పాల్గొన్న వారికి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో తోలేటి జయసింహ, వూటుకూరు యజ్ఞకృష్ణతో పాటు పలువురు గ్రామస్థులు, పాఠకులు పాల్గొన్నారు.