BREAKING
thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి
Date of Publish : 02 September 2026, 08:08 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో ఘనంగా నందమూరి హరికృష్ణ జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Sep, 2026 - 08:08 PM
77 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం సినీ నటుడు, నిర్మాత, మాజీ పార్లమెంట్ సభ్యుడు నందమూరి హరికృష్ణ 70వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ నందమూరి హరికృష్ణ సినీ నటుడిగా, నిర్మాతగా, హిందూపురం శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా ప్రజా సేవలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. నందమూరి తారక రామారావు రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో హరికృష్ణ చైతన్య రథానికి సారథిగా వ్యవహరించి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి లక్షలాది కిలోమీటర్లు ప్రయాణించారని తెలిపారు. పార్టీ అభివృద్ధికి, ప్రజా సేవకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి చిరుమామిళ్ల వెంకటనారాయణ, గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వర్లు, సహకార సంఘం మాజీ అధ్యక్షుడు తన్నీరు వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దేవర రాములు, తోట సత్యం, నాటక కళాకారుడు రాళ్లచర్ల జగన్నాథం, కాన్వెంట్ ప్రిన్సిపాల్ తోట నాగరాజు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.