BREAKING
thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన
Date of Publish : 02 September 2026, 08:08 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు జనసేన కార్యాలయంలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Sep, 2026 - 08:08 PM
58 వీక్షణలు

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు జనసేన ఇంచార్జి మనుబోలు శ్రీనివాసరావు, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు

తిరువూరు జనసేన కార్యాలయంలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

కూటమిగా కలిసి పనిచేస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరం: ఎంపీ కేశినేని చిన్ని

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరులోని జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), తిరువూరు జనసేన నియోజకవర్గ ఇంచార్జి మనుబోలు శ్రీనివాసరావు, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొని కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఎన్టీఆర్ జిల్లా కూటమి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దుష్ట పరిపాలనకు ముగింపు పలికేందుకు పవన్ కళ్యాణ్ చేసిన కృషి మరువలేనిదని అన్నారు.

ఎటువంటి వ్యక్తిగత లాభాలను ఆశించకుండా కూటమిగా కలిసి పనిచేస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆలోచించిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. పవన్ కళ్యాణ్ చేపట్టే ప్రతి కార్యక్రమం రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాల కోసమేనని అన్నారు.

టీడీపీ కష్టకాలంలో కూడా అండగా నిలిచిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కేశినేని చిన్ని పేర్కొన్నారు. ఇలాంటి నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న మైత్రి ఎంతో గొప్పదని ఎంపీ అన్నారు. ఆ మైత్రి స్ఫూర్తితో కూటమి నాయకులంతా ఐక్యంగా కలిసి పనిచేస్తూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.