BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 19 August 2026, 04:06 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో ఘనంగా శంకర్ దయాళ్ శర్మ జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 04:06 PM
116 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో మాజీ రాష్ట్రపతి, స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ 108వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శంకర్ దయాళ్ శర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడిగా, రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతిగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా, న్యాయశాస్త్ర ఆచార్యుడిగా, కవిగా, రచయితగా శంకర్ దయాళ్ శర్మ విశిష్ట సేవలు అందించారని కొనియాడారు.

1918 ఆగస్టు 19న జన్మించిన శంకర్ దయాళ్ శర్మ 1999 డిసెంబర్ 26న కన్నుమూశారని తెలిపారు. దేశం పట్ల ఆయనకున్న అంకితభావం, భారత రాజ్యాంగంపై ఉన్న లోతైన అవగాహన నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి, అంగన్వాడీ టీచర్ కే. లింగమ్మ, అంగన్వాడీ సిబ్బంది దేవర అంజలి, మహిళా కమిటీ సభ్యులు, గ్రామస్తులు, అంగన్వాడీ చిన్నారులు పాల్గొన్నారు.