BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 03 August 2026, 02:29 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ జన్మదిన వేడుకలు ఘనంగా

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Aug, 2026 - 02:29 PM
258 వీక్షణలు

అంగన్వాడి చిన్నారులకు పలకలు, మిఠాయిల పంపిణీ

గంపలగూడెం, ఆగస్టు 3 (న్యూస్): ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) 57వ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని 99వ అంగన్వాడి కేంద్రం చిన్నారులకు పలకలు, మిఠాయిలు పంపిణీ చేసి జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి గ్రామ టీడీపీ అధ్యక్షుడు బొలగాని కోటేశ్వరావు అధ్యక్షత వహించారు. మాజీ సర్పంచి సంగెపు నారాయణ మాట్లాడుతూ కేశినేని శివనాథ్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఈ ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజాసేవలో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని, ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు. ప్రజాప్రతినిధుల సేవలను గుర్తు చేసుకునే సందర్భంగా ఇలాంటి జన్మదిన వేడుకలు నిలుస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్షుడు నాగళ్ళ మురళి, టీడీపీ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వరరావు, పంది వెంకట్రావు, కొండేటి వెంకటప్పయ్య, మోటకట్ల రాజారెడ్డి, యనమద్ది విజయకుమార్, కోరంపల్లి పుల్లారావు, దేవరపల్లి శ్రీను, చెన్నపై అచ్చంరాజు, పంతంగి సాయికుమార్, సంగెపు ఏలియ్య, సంగెపు అంజయ్య, సాయిబాబా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు, అంగన్వాడి ఉపాధ్యాయిని కే. లింగమ్మ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.