BREAKING
thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన..
Date of Publish : 15 May 2026, 06:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెట్రోల్ , డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై ఆందోళనకు పిలుపు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 06:52 PM
215 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో సిపిఐ ఎం.ఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును తీవ్రంగా ఖండించారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు.

పశ్చిమాసియా యుద్ధాన్ని సాకుగా చూపిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతోందని హరినాథ్ విమర్శించారు. పెట్రోల్‌పై లీటరుకు రూ.3.30, డీజిల్‌పై రూ.3.14, గ్యాస్‌పై కేజీకి రూ.7 చొప్పున పెంచారని పేర్కొన్నారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల అనంతరం ధరలు పెంచి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఈ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉందన్నారు.

పెట్రోల్, డీజిల్, గ్యాస్‌పై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అమెరికా ఒత్తిడికి లోనై రష్యా, ఇరాన్ దేశాల నుంచి చమురు దిగుమతులను తగ్గించడం వల్లే దేశ ప్రజలపై ఆర్థిక భారం పడుతోందని విమర్శించారు.

మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పార్టీలకు అతీతంగా ఉద్యమించాలని హరినాథ్ పిలుపునిచ్చారు. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా సిపిఐ ఎం.ఎల్ లిబరేషన్, వామపక్షాలు, ప్రజాస్వామ్య శక్తులతో కలిసి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.