BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 08 April 2026, 03:33 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పిడుగుపాటుకు పాడి పశువు మృత్యువాత

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Apr, 2026 - 03:33 PM
195 వీక్షణలు

పిడుగుపాటుకు పాడి పశువు మృత్యువాత

రూ. 1లక్ష విలువైన పాడిగేదె మృతి

జీవనాధారం కోల్పోయిన బాధిత కుటుంబం

పిడుగుపాటుకు పశువు మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మండల కేంద్రమైన జి. కొండూరు గ్రామంలో చోటుచేసుకుంది. జి. కొండూరు గ్రామానికి చెందిన బుడిపూటి ధనలక్ష్మి పశువులు మేపుకుంటూ జీవిస్తుంది. వీరిది పూర్తిగా పేద కుటుంబం. జి. కొండూరు శివార్లలోని పినపాక రోడ్డులో పరిసర వ్యవసాయ భూమిలో పశువులు మేపుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ సమయంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో పశువు అక్కడికక్కడే మృత్యువాత పడింది. తృటిలో ఆమెకు కూడా ప్రాణాపాయం తప్పింది. రూ.1 లక్ష విలువైన ఉన్న ఒక్క పాడిగేదె మృతి చెందటంతో ఆమె కుటుంబం జీవనాధారం కోల్పోయింది. భర్త అంగవైకల్యంతో బాధపడుతూ ఉంటుంది. ధనలక్ష్మికి కూడా గతంలో జరిగిన ఓ ప్రమాదంలో శస్త్రచికిత్స జరిగింది. ఆమె కూడా పాక్షిక అంగవైకల్యంతోనే బతుకు బండిని ఈడుస్తోంది. ప్రభుత్వం స్పందించి తమకు ఆర్థికసాయం చేయాలని ధనలక్ష్మి విజ్ఞప్తి చేసింది. అధికారులు స్పందించి తమకు ప్రకృతి విపత్తు సాయం అందించాలని కోరుతోంది. లేదా కనీసం పి-4 పథకంలో భాగంగా దాతలు అయినా స్పందించాలని కోరుతోంది.