BREAKING
హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
Date of Publish : 04 June 2026, 04:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పిడుగుపాటుతో మృతి చెందిన యువకుడి కుటుంబాన్ని పరామర్శించిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 04:17 PM
110 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం చింతలవల్లి శివారు కొత్తూరు గ్రామంలో మంగళవారం కురిసిన అకాల వర్షానికి పిడుగుపాటుకు గురై గంగుల ఏలిబాబు (21) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనపై తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

ఏలిబాబు కుటుంబ సభ్యులను కలిసి వారి దుఃఖంలో భాగస్వామ్యమయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ధైర్యంగా ఉండాలని ఓదార్పునిచ్చారు. అకాల మరణం కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, పార్టీ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

గ్రామస్తులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ పరామర్శ కార్యక్రమంలో పాల్గొని మృతుడికి నివాళులర్పించారు.