BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 03 April 2026, 03:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పంచాయతీలకు కొత్త దిశ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Apr, 2026 - 03:51 PM
211 వీక్షణలు

పంచాయతీలకు కొత్త దిశ – స్పెషల్ ఆఫీసర్‌గా మాసగిరి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకారం

ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో గ్రామ పాలనకు కొత్త ఊపు వచ్చింది. బూరుగుగూడెం, పోతనపల్లి, పర్వతపురం గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్‌గా మాసగిరి శ్రీనివాస్ ఈరోజు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

బాధ్యతలు చేపట్టిన అనంతరం మాట్లాడుతూ… మూడు పంచాయతీల సమగ్ర అభివృద్ధే తన లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, రహదారుల మెరుగుదల వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.

అలాగే ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వేగంగా పరిష్కరించే విధంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హులకూ చేరేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.

గ్రామ ప్రజల సహకారంతో పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని మాసగిరి శ్రీనివాస్ అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజా గోపాల్ బూరుగుగూడెం టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు రాజబోయిన దశరధ రామరాజు, సీనియర్ నేత కాలసాని సూర్య నారాయణ, శేఖర్,పర్వతాపురం టీడీపీ గ్రామ పార్టీ మాజీ అధ్యక్షులు బొర్రా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు